TS POLYCET Results: తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

TS POLYCET Results: తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. 84.20 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు.

Arun Chilukuri
Updated on: 11 Jun 2024 7:18 PM IST
Telangana Polycet Results Declared
X

తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదల...

TS POLYCET Results: తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. 84.20 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యా భవన్‌లో పాలిసెట్‌ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి మే 24న ఈ పరీక్ష నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా 82,809 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 69,728 మంది (84.20 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 46,319 మంది బాలురు పరీక్షకు హాజరవగా 37,269 మంది (80.47 శాతం), 36,496 మంది బాలికల్లో 32,459 మంది (88.94 శాతం) అర్హత సాధించారు. ఇక ఎంపీసీ విభాగంలో 84.20 శాతం, ఎమ్ బైపీసీలో 82.48 శాతం ఉత్తీర్ణత నమోదయింది. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Arun Chilukuri

Arun Chilukuri

Next Story