Telangana: మార్చి 12 నుంచి ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ మెయిన్స్‌ ఎగ్జామ్స్‌

Telangana: మార్చి 12 నుంచి ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ మెయిన్స్‌ ఎగ్జామ్స్‌

Jyothi
Published on: 1 Jan 2023 12:46 PM IST
Telangana Police Recruitment Mains Exam Dates Finalised
X

Telangana: మార్చి 12 నుంచి ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ మెయిన్స్‌ ఎగ్జామ్స్‌

Telangana: హైదరాబాద్‌: పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుదిదశకు చేరుకున్నది. రిక్రూట్‌మెంట్‌లో భాగంగా తుది అంకమైన మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ తేదీలను పోలీస్‌ నియామక మండలి ఖరారు చేసింది. మార్చి 12 నుంచి మెయిన్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 9న సివిల్‌ ఎస్‌ఐ నియామక పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్‌ 23న అన్ని రకాల కానిస్టేబుల్‌ పోస్టులకు మెయిన్స్‌ ఎగ్జామ్స్‌ నిర్వహిస్తారు.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష ఉంటుంది. కాగా, ప్రస్తుతం ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి ఫిజికల్‌ ఈవెంట్స్‌ కొనసాగుతున్నాయి. ఈ నెల 5న దేహదారుఢ్య పరీక్షలు ముగుస్తాయి. ఈ నేపథ్యంలో మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ను నియామక మండలి ఖరారు చేసింది. హాల్‌టికెట్లను ఎప్పటినుంచి డౌన్‌లోడ్‌ చేసుకోచ్చనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని బోర్డు వెల్లడించింది.

Jyothi

Jyothi

Next Story