TS Inter Board: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board: తీవ్ర సంచలనం సృష్టించిన అంబర్‌పేట్‌ నారాయణ కాలేజీ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

Arun Chilukuri
Published on: 19 Aug 2022 8:00 PM IST
Telangana Intermediate Board Gave Orders to Junior Colleges
X

TS Inter Board: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board: తీవ్ర సంచలనం సృష్టించిన అంబర్‌పేట్‌ నారాయణ కాలేజీ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఘటనపై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాలేజీ ప్రాంగణంలో అనవసర ఘటన ఎందుకు జరిగిందో చెప్పాలంటూ ఇంటర్ బోర్డ్‌ వివరణ కోరింది. తెలంగాణ ఇంట‌ర్ విద్యార్థుల స‌ర్టిఫికేట్లు ఆపోద్దంటూ కాలేజీల‌కు ఇంట‌ర్ బోర్డ్ కీల‌క ఆదేశాల‌ను జారీ చేసింది.

కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రిన్సిపల్స్‌దేనని స్పష్టం చేశారు. కారణమేదైనా విద్యార్థుల సర్టిఫికెట్లు ఆపడానికి వీల్లేదని హెచ్చరించారు. సర్టిఫికెట్లు ఇవ్వకపోతే డీఐఈవో, ఇంటర్‌ బోర్డుకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రైవేటు కాలేజీలను తనిఖీ చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story