TS Inter Admissions 2022: జూన్‌ 20 నుంచి తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు..!

TS Inter Admissions 2022: తెలంగాణలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలు షురూకానున్నాయి.

Arun Chilukuri
Published on: 19 Jun 2022 7:36 PM IST
Telangana Inter First Year 2022-23 Admissions from June 20
X

TS Inter Admissions 2022: జూన్‌ 20 నుంచి తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు..!

TS Inter Admissions 2022: తెలంగాణలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలు షురూకానున్నాయి. రేపటి నుంచి (జూన్‌ 20) ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో 2022-23 విద్యా సంత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు ప్రారంభమవుతాయని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ని విడుదల చేసింది. మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ జూన్‌ 20 నుంచి జూలై 20 వరకు కొనసాగుతుందని తెలిపింది.

అలాగే జులై 1 నుంచి ఫస్టియర్‌ తరగతులు ప్రారంభమవుతాయి. ఇంటర్‌ బోర్డు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్‌ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. 221 పని రోజుల విద్యా సంవత్సరాన్ని ప్రకటించింది. అక్టోబర్‌ 2 నుంచి 9 వరకు ఇంటర్‌ విద్యార్థులకు దసరా సెలవులు కాగా.. 2023, జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని పేర్కొంది. అలాగే.. ఫిబ్రవరి 6 నుంచి 13 వరకు ప్రి ఫైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6వ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్‌ పరీక్షలు జరుగుతాయని.. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వ వరకు ఇంటర్‌ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి మే 31 వరకు వేసవి సెలవులుంటాయని.. జూన్‌ 1 కాలేజీలు పునఃప్రారంభమవుతాయని పేర్కొంది. మరిన్ని వివరాల కోసం ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ https://tsbie.cgg.gov.in/సంప్రదించవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story