Telangana: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. మ‌రో 2,440 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌..

Jobs Notification 2022: తెలంగాణ‌లో ఉద్యోగాల భర్తీకి వ‌రుస‌గా నోటిఫికేష‌న్లు జారీ అవుతున్నాయి.

Arun Chilukuri
Published on: 22 July 2022 7:50 PM IST
Telangana Govt Issues Orders for Recruiting Another 2,440 Vacancies
X

Telangana: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. మ‌రో 2,440 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌..

Jobs Notification 2022: తెలంగాణ‌లో ఉద్యోగాల భర్తీకి వ‌రుస‌గా నోటిఫికేష‌న్లు జారీ అవుతున్నాయి. తాజాగా విద్యా శాఖ‌, ఆర్కైవ్స్ శాఖ‌ల్లోని 2,440 ఖాళీల భ‌ర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ శుక్ర‌వారం అనుమ‌తి మంజూరు చేసింది. 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులు, ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో 40 లైబ్రేరియన్, 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, ఆర్కైవ్స్ విభాగంలో 14 పోస్టులు, పాలిటెక్నిక్ కళాశాలల్లో 247 లెక్చరర్, 14 ఇన్ స్ట్రక్టర్, 31 లైబ్రేరియన్, 5 మాట్రన్, 25 ఎలక్ట్రీషియన్, 37 పీడీ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. కళాశాల విద్యావిభాగంలో 491 లెక్చరర్, 24 లైబ్రేరియన్, 29 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆర్థిక శాఖ అనుమ‌తి నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే ఈ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు జారీ కానున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story