TSSPDCL: జూనియర్‌ లైన్‌మెన్‌ పరీక్ష రద్దు.. త్వరలో కొత్త నోటిఫికేషన్‌..

Telangana Government Cancelled TSSPDCL Junior Lineman Written Exam
x

TSSPDCL: జూనియర్‌ లైన్‌మెన్‌ పరీక్ష రద్దు.. త్వరలో కొత్త నోటిఫికేషన్‌..

Highlights

TSSPDCL: తెలంగాణలో టీఎస్ఎస్‌పీడీసీఎల్ జూనియ‌ర్ లైన్‌మెన్ ప‌రీక్ష ర‌ద్దు చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

TSSPDCL: తెలంగాణలో టీఎస్ఎస్‌పీడీసీఎల్ జూనియ‌ర్ లైన్‌మెన్ ప‌రీక్ష ర‌ద్దు చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఏడాది జులై 17న వెయ్యి పోస్టుల భ‌ర్తీకి రాత ప‌రీక్ష నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. 181 మంది అభ్య‌ర్థులు మాల్ ప్రాక్టీస్ పాల్ప‌డిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో నిర్ధార‌ణ అయింది. ఘట్‌కేసర్‌ పరీక్ష కేంద్రంలో ఓ అభ్యర్థి చరవాణితో చిక్కడంతో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

తమకు సమాధానాలు చెబుతామని రూ.లక్షలు తీసుకుని మోసం చేశారని కొందరు ఉద్యోగులపై ఓ అభ్యర్థి అంబర్‌పేట్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు ఏడీఈలతో సహా ఐదుగురు ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసి విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఈ కేసులో ఇప్పటికే పాత్ర ఉన్న ఐదుగురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. త్వ‌ర‌లోనే కొత్త నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేస్తామ‌ని టీఎస్ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ప్ర‌క‌టించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories