10th Results: జూన్‌ 30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల

TS SSC Results 2022: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు జూన్ 30న విడుద‌ల కానున్నాయి.

Arun Chilukuri
Published on: 28 Jun 2022 5:10 PM IST
Telangana 10th Class Result Date June 30
X

10th Results: జూన్‌ 30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల

TS SSC Results 2022: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు జూన్ 30న విడుద‌ల కానున్నాయి. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు మే 23 నుంచి జూన్ 1వ తేదీ వ‌ర‌కు కొన‌సాగిన విష‌యం తెలిసిందే. విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ www.bse.telangana.gov.in లేదా www.bseresults.telangana.gov.in లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story