లైసెన్స్‌ ఉన్నవారు ఈ పోలీస్‌ జాబ్‌ అస్సలు మిస్‌ కావొద్దు.. చివరితేదీ దగ్గర పడింది..!

Staff Selection Commission has Released a Notification for Filling up the Posts of Constable Driver in Delhi Police
x

లైసెన్స్‌ ఉన్నవారు ఈ పోలీస్‌ జాబ్‌ అస్సలు మిస్‌ కావొద్దు.. చివరితేదీ దగ్గర పడింది..!

Highlights

Delhi Police Recruitment: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)ఢిల్లీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ కింద కానిస్టేబుల్‌ డ్రైవర్‌ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Delhi Police Recruitment: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)ఢిల్లీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ కింద కానిస్టేబుల్‌ డ్రైవర్‌ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.inని సందర్శించడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేయడానికి అభ్యర్థి వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. మొత్తం కానిస్టేబుల్ డ్రైవర్ (పురుషుడు) పోస్టులు 1,411 ఖాళీలని భర్తీ చేస్తున్నారు.

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులందరూ జూలై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యా సంస్థ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అదే సమయంలో భారీ వాహనాలను ఎలా నడపాలో తెలుసుకోవాలి. అంటే దరఖాస్తుదారులు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ (DL-HMV)కలిగి ఉండాలి. చాలా కాలం తర్వాత ఢిల్లీ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో డ్రైవర్‌ పోస్టుల భర్తీ చేస్తున్నారు.

ఈ పోస్టులకి ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ జూలై 29. అదేవిధంగా ఫీజు చెల్లింపునకు జులై 30. ఆన్‌లైన్ దరఖాస్తులో సవరణలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 02 గా నిర్ణయించారు. ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం దరఖాస్తు రుసుము గురించి మాట్లాడితే జనరల్ / OBC / EWS దరఖాస్తు రుసుము రూ. 100 చెల్లించాలి. SC / ST / ESM ఎటువంటి దరఖాస్తు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పోస్టులలో ఎంపికైన అభ్యర్థులందరికీ నెలకు రూ. 21,700-69,100 జీతం చెల్లిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories