నిరుద్యోగులకి శుభవార్త.. సెంట్రల్‌ పోలీస్‌ ఫోర్స్‌లో 4300 ఎస్సై పోస్టులు..!

ssc cpo recruitment 2022 4300 Sub-Inspector Posts in Central Armed Police Force and Delhi Police
x

నిరుద్యోగులకి శుభవార్త.. సెంట్రల్‌ పోలీస్‌ ఫోర్స్‌లో 4300 ఎస్సై పోస్టులు..!

Highlights

నిరుద్యోగులకి శుభవార్త.. సెంట్రల్‌ పోలీస్‌ ఫోర్స్‌లో 4300 ఎస్సై పోస్టులు..!

SSC CPO Recruitment 2022: సెంట్రల్ (SSC) ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్, ఢిల్లీ పోలీస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ను సందర్శించడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ఆగస్టు 30 వరకు కొనసాగుతుంది. ఆగస్టు 10 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

మొత్తం పోస్టులు

1. ఢిల్లీ పోలీస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు: 228 పోస్టులు.

2. ఢిల్లీ పోలీస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) మహిళలు: 112 పోస్టులు.

3.CAPF BSFలో సబ్-ఇన్‌స్పెక్టర్ (GD): 353 పోస్టులు.

4.CAPF CISFలో సబ్-ఇన్‌స్పెక్టర్ (GD): 86 పోస్టులు.

5.CAPF CRPFలో సబ్-ఇన్‌స్పెక్టర్ (GD): 3112 పోస్టులు.

6.CAPF ITBPలో సబ్-ఇన్‌స్పెక్టర్ (GD): 191 పోస్టులు.

7.CAPF SSBలో సబ్-ఇన్‌స్పెక్టర్ (GD): 218 పోస్టులు.

అవసరమైన విద్యార్హత

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏదైనా డిగ్రీని కలిగి ఉండాలి.

వయోపరిమితి

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. SC/ST/లకి ఐదేళ్ల సడలింపు, ఓబీసీలకి మూడేళ్ల వయసు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము

ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 100 ఫీజు చెల్లించాలి. SC/ST/మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ

రాత పరీక్ష మరియు ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

1. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 10 ఆగస్టు 2022.

2. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 30 ఆగస్టు 2022.

3. ఆన్‌లైన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 31 ఆగస్టు 2022.

4. 'దరఖాస్తు దిద్దుబాటు కోసం విండో', దిద్దుబాటు రుసుము ఆన్‌లైన్‌లో చెల్లింపు తేదీ: 01 సెప్టెంబర్ 2022.

5. కంప్యూటర్ ఆధారిత పరీక్ష షెడ్యూల్: నవంబర్ 2022.

Show Full Article
Print Article
Next Story
More Stories