ఇండియన్‌ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్‌.. ఎంపికైతే నెలకి 2.50 లక్షల జీతం..!

Short Service Commission Recruitment in Indian Army Salary 2.50 Lakhs per Month if Selected
x

ఇండియన్‌ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్‌.. ఎంపికైతే నెలకి 2.50 లక్షల జీతం..!

Highlights

Indian Army Recruitment 2023: ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ కింద నోటిఫికేషన్ విడుదలైంది.

Indian Army Recruitment 2023: ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్ కింద నోటిఫికేషన్ విడుదలైంది. దీని ప్రకారం 55 ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి కనీస వయోపరిమితి 19 సంవత్సరాలు గరిష్ట వయో పరిమితి 25 సంవత్సరాలు. ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. అభ్యర్థి 10 సంవత్సరాల కాలానికి ఎంపికవుతారు. ఈ కాలాన్ని మరో 4 సంవత్సరాలు పొడిగించవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీలోపు ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించాలి. తప్పులున్న దరఖాస్తులని తిరస్కరిస్తారని గుర్తుంచుకోండి.

రాత పరీక్ష / వ్యక్తిగత ఇంటర్వ్యూ / మెడికల్ టెస్ట్ / ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పురుషులు లేదా మహిళలకి సాధారణ సైన్యంలో 14 సంవత్సరాల పాటు షార్ట్ సర్వీస్ కమిషన్ ఇస్తారు. అనగా మొదట 10 సంవత్సరాల ప్రారంభ కాలానికి తరువాత అవసరముంటే మరో 4 సంవత్సరాల కాలానికి పొడిగిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దీని కోసం అభ్యర్థి అధికారిక వెబ్‌సైట్‌లో 'ఆఫీసర్ ఎంట్రీ అప్లికేషన్/లాగిన్'పై క్లిక్ చేసి ఆపై 'రిజిస్ట్రేషన్'పై క్లిక్ చేయాలి. అక్కడ ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదివిన తర్వాత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను నింపాలి. ఆన్‌లైన్ దరఖాస్తును 15 ఫిబ్రవరి 2023 వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు చేయవచ్చు. ఈ పోస్టులకి ఎంపికైన వ్యక్తులకి నెలకు రూ.56,100 నుంచి రూ.2,50,000 మధ్య పే స్కేల్‌ ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories