నిరుద్యోగులకి బంపర్ ఆఫర్.. టెన్త్‌, ఇంటర్‌తో 3068 ఉద్యోగాలు..!

AOC Recruitment 2022: పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ చదివిన నిరుద్యోగులకి ఈ వార్త శుభవార్తని చెప్పవచ్చు.

Arun Chilukuri
Published on: 3 Sept 2022 5:45 PM IST
Secunderabad Army Ordnance Corps Aoc Recruitment 2022
X

నిరుద్యోగులకి బంపర్ ఆఫర్.. టెన్త్‌, ఇంటర్‌తో 3068 ఉద్యోగాలు..!

AOC Recruitment 2022: పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ చదివిన నిరుద్యోగులకి ఈ వార్త శుభవార్తని చెప్పవచ్చు. సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్ (CRC) AOC సికింద్రాబాద్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో 3 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారికి వెబ్‌సైట్ https://aocrecruitment.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 3068 ట్రేడ్స్‌మెన్‌ మేట్‌, ఫైర్‌మ్యాన్‌, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అభ్యర్ధుల వయసు సెప్టెంబర్‌ 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 25 యేళ్ల మధ్య ఉండాలి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 21, 2022వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎంపికైతే నెలకు రూ.18,000ల నుంచి రూ.63,200ల వరకు జీతం చెల్లిస్తారు. అప్లై చేసేముందు ఒక్కసారి నోటిఫికేషన్‌ పూర్తిగా చదవండి.

అర్హతలు: ట్రేడ్స్ మెన్ మేట్ ఉద్యోగాలకు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్శిటీ నుంచి 10వ/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా తత్సమానం కలిగి ఉండాలి.

ఫైర్ మెన్ ఉద్యోగాలకు.. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్శిటీ నుంచి 10వ/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా తత్సమానం కలిగి ఉండాలి.

జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్శిటీ నుంచి 12వ ఉత్తీర్ణత లేదా తత్సమానాన్ని కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

1. ఫిజికల్/ప్రాక్టికల్/స్కిల్ పరీక్షలు

2. రాత పరీక్ష

3. డాక్యుమెంట్ వెరిఫికేషన్

4. మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్

Arun Chilukuri

Arun Chilukuri

Next Story