TS EAMCET: విద్యార్థులకు అలర్ట్.. వాయిదా పడిన ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్ష షెడ్యూల్‌ ఖరారు

Postponed TS EAMCET Entrance Exams Schedule Released
x

TS EAMCET: విద్యార్థులకు అలర్ట్.. వాయిదా పడిన ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్ష షెడ్యూల్‌ ఖరారు

Highlights

TS EAMCET: ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

TS EAMCET: ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా విద్యాసంస్థలకు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం అన్ని పరీక్షలకు వాయిదా వేసింది. తాజాగా వాయిదా పడిన ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది.

ఈనెల 30, 31న ఎంసెట్‌ (అగ్రికల్చర్‌) పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి వెల్లడించారు. అలాగే ఆగస్టు 1న ఈసెట్‌, ఆగస్టు 2 నుంచి 5 వరకు పీజీఈసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సంబంధిత వెబ్‌సైట్‌ల నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories