TS News: తెలంగాణలో 1226 పోస్ట్‌ ఆఫీస్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..!

Post office jobs in Telangana Selection without written test | TS Job Notifications 2022
x

TS News: తెలంగాణలో 1226 పోస్ట్‌ ఆఫీస్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక..!

Highlights

TS News: ఇండియా పోస్ట్ భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది...

TS News: ఇండియా పోస్ట్ భారీగా ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 38,926 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) పోస్టులతో పాటు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టులున్నాయి. ఇక రెండు తెలుగురాష్ట్రాల్లో 2942 పోస్టులున్నాయి. ఇందులో తెలంగాణలో 1226, ఆంధ్రప్రదేశ్‌లో 1716 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 5 దరఖాస్తులకు చివరి తేదీ.

అర్హతలు- ఎంపిక విధానం: పదవ తరగతి పాసైనవారంతా ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ ఈ ఖాళీలను మెరిట్ ద్వారా ఎంపిక చేస్తోంది. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పదవ తరగతిలో వచ్చిన మార్కుల్ని పరిగణలోకి తీసుకొని మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

10వ తరగతి పాసై ఉండాలి. స్థానిక భాషలో 10వ తరగతి వరకు చదివి ఉండాలి. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌వుమెన్‌కు ఫీజు లేదు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు రూ.12,000, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 చెల్లిస్తారు.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://indiapostgdsonline.gov.in/చూడండి.

Show Full Article
Print Article
Next Story
More Stories