Rozgar Mela: నిరుద్యోగ యువతకు కేంద్రం గుడ్‎న్యూస్.. 10లక్షల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Rozgar Mela: దేశంలోని యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Arun Chilukuri
Published on: 22 Oct 2022 6:16 PM IST
PM Modi Launch Rozgar Mela of Recruitment 10 Lakh Jobs
X

Rozgar Mela: నిరుద్యోగ యువతకు కేంద్రం గుడ్‎న్యూస్.. 10లక్షల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Rozgar Mela: దేశంలోని యువతకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 10 లక్షల ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియను ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో లాంచనంగా ప్రారంభించారు. రోజ్‌గార్ మేళాలో భాగంగా కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో గెజిటెడ్, నాన్ గెజిటెడ్, సబార్డినేట్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొదటి దశలో కేంద్ర మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రోజ్‌గార్ మేళాలో ఎంపికైన 75 వేల మందికి నియామక పత్రాలను కేంద్ర మంత్రులు అందజేస్తారు. ఈ మేళాలో నియమితులైనవారు గ్రూప్-ఏ, గ్రూప్-బీ గెజిటెడ్, నాన్ గెజిటెడ్, గ్రూప్-సీ స్థాయి ఉద్యోగాల్లో చేరుతారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story