Dussehra Holiday 2022: దసరా సెలవులపై విద్యాశాఖ క్లారిటీ.. సెలవులు ఎన్ని రోజులంటే?

Dussehra Holiday 2022: తెలంగాణలో దసరా సెలవులను తగ్గిస్తారంటూ రెండు రోజులుగా సాగుతున్న ప్రచారంపై విద్యాశాఖ స్పందించింది.

Arun Chilukuri
Updated on: 21 Sept 2022 2:39 PM IST
No Change in Dussehra Holidays for Schools in Telangana
X

Dussehra Holiday 2022: దసరా సెలవులపై విద్యాశాఖ క్లారిటీ.. సెలవులు ఎన్ని రోజులంటే?

Dussehra Holiday 2022: తెలంగాణలో దసరా సెలవులను తగ్గిస్తారంటూ రెండు రోజులుగా సాగుతున్న ప్రచారంపై విద్యాశాఖ స్పందించింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ''సెలవుల్లో ఎలాంటి మార్పు లేదు. ఈనెల 26 నుంచి అక్టోబర్ 9 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయి. అక్టోబర్ 10న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి'' అని విద్యాశాఖ వెల్లడించింది. కాగా భారీ వర్షాల కారణంగా జులైలో పాఠశాలలకు సెలవులు ఇచ్చినందున.. నష్టపోయిన బోధన పనిదినాల భర్తీకి దసరా సెలవులు తగ్గించాలని పాఠశాల విద్యాశాఖకు ఎస్‌సీఈఆర్‌టీ సూచించిన విషయం తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story