NVS Non Teaching Posts Registration 2024: నిరుద్యోగులకు అలర్ట్‌.. నవోదయ స్కూల్స్‌లో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు..!

Navodaya Vidyalaya Samiti Recruitment 2024 for 1377 Non Teaching Posts Check for all Details
x

NVS Non Teaching Posts Registration 2024: నిరుద్యోగులకు అలర్ట్‌.. నవోదయ స్కూల్స్‌లో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు..!

Highlights

NVS Non Teaching Posts Registration 2024: నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది.

NVS Non Teaching Posts Registration 2024: నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది. మొత్తం 1377 ఉద్యోగాలను భర్తీచేస్తారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు NVS అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.inను సందర్శించి ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్‌ ఫారమ్‌ నింపాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 30, 2024గా నిర్ణయించారు. అయితే అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకునేముందు ఒక్కసారి నోటిఫికేషన్‌ను చదవాలని సూచించారు.

అప్లికేషన్‌ ఫారమ్‌ ఎడిట్‌ విండోను కమిటీ మే 4, 2024న క్లోజ్‌ చేస్తుంది. దీని తర్వాత అభ్యర్థులు NTA నుంచి అడ్మిట్ కార్డ్ విడుదల కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ కింద 1,377 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని NVS లక్ష్యంగా పెట్టుకుంది. వాటి గురించి తెలుసుకుందాం.

1. మహిళా స్టాఫ్ నర్స్: 121 పోస్టులు

2. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 5 పోస్టులు

3. ఆడిట్ అసిస్టెంట్: 12 పోస్టులు

4. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్: 4 పోస్టులు

5. లీగల్ అసిస్టెంట్: 1 పోస్ట్

6. స్టెనోగ్రాఫర్: 23 పోస్టులు

7. కంప్యూటర్ ఆపరేటర్: 2 పోస్టులు

8. క్యాటరింగ్ సూపర్‌వైజర్: 78 పోస్టులు

9. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 381 పోస్టులు

10. ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 128 పోస్టులు

11. ల్యాబ్ అటెండెంట్: 161 పోస్టులు

12. మెస్ హెల్పర్: 442 పోస్ట్‌లు

13. MTS: 19 పోస్ట్‌లు

ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలి..?

1. NVS 'exams.nta.ac.in/NVS' లేదా 'nvs.ntaonline.in' అధికారిక రిక్రూట్‌మెంట్ పోర్టల్‌కి వెళ్లాలి.

2. తర్వాత హోమ్ పేజీలో "రిజిస్ట్రేషన్/లాగిన్" ట్యాబ్‌ను చూడాలి.

3. ఇప్పుడు కొత్త విండోలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను కంప్లీట్‌ చేయాలి.

4. తర్వాత మీ దగ్గర ఉన్న ఆధారాలను ఉపయోగించి లాగిన్ చేసి అప్లికేషన్‌ ఫారమ్‌ నింపాలి.

5. తర్వాత అప్లికేషన్‌ రుసుము చెల్లించి ఫారమ్‌ను సమర్పించాలి.

6. చివరగా భవిష్యత్ ఉపయోగం కోసం అప్లికేషన్‌ ఫారమ్ కాపీని డౌన్‌లోడ్ చేసి ఉంచుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories