టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదాపై మంత్రి సబితా కీలక ప్రకటన

TS TET Exam: తెలంగాణలో జూన్‌ 12న టెట్‌ ఎగ్జామ్ జరగనుంది.

Arun Chilukuri
Published on: 21 May 2022 3:44 PM IST
టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదాపై మంత్రి సబితా కీలక ప్రకటన
X

టెట్ అభ్యర్థులకు అలర్ట్.. పరీక్ష వాయిదాపై మంత్రి సబితా కీలక ప్రకటన

TS TET Exam: తెలంగాణలో జూన్‌ 12న టెట్‌ ఎగ్జామ్ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో తల మునకలయ్యారు సంబంధిత అధికారులు. అయితేఅదే రోజు ఆర్ఆర్‌బీ రైల్వే ఎగ్జామ్‌ కూడా ఉంది. దీంతో పలువురు అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. టెట్‌ను వాయిదా వేయాలని మంత్రి కేటీఆర్‌కు ఓ అభ్యర్థి ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. దీంతో కేటీఆర్‌ ఆ ట్వీట్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఫార్వర్డ్‌ చేశారు. అయితే మంత్రి సబితారెడ్డి ఈ అంశంపై స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో టెట్ వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేశారు. అన్ని అంశాలను, ఇతర పోటీ పరీక్షలను పరిగణనలోకి తీసుకున్నాకే టెట్‌ పరీక్షపై నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. కాగా జూన్‌ 12న తెలంగాణలో టెట్‌ పరీక్ష జరగనుంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story