Dangerous Jobs: ఇండియాలో అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగాలు ఇవే.. అయినప్పటికీ అత్యధిక డిమాండ్‌..!

Know About the Most Dangerous Government Jobs in India
x

Dangerous Jobs: ఇండియాలో అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగాలు ఇవే.. అయినప్పటికీ అత్యధిక డిమాండ్‌..!

Highlights

Dangerous Jobs: ప్రభుత్వ ఉద్యోగాలలో అన్నీ సాఫీగా సాగిపోయే ఉద్యోగాలు ఉండవు. కొన్ని లైఫ్‌ రిస్క్‌తో కూడుకొని ఉంటాయి.

Dangerous Jobs: ప్రభుత్వ ఉద్యోగాలలో అన్నీ సాఫీగా సాగిపోయే ఉద్యోగాలు ఉండవు. కొన్ని లైఫ్‌ రిస్క్‌తో కూడుకొని ఉంటాయి. ఇలాంటి ఉద్యోగాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరేముందు దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి. భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకి కొదవలేదు. కానీ ఇందులో అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. సాయుధ దళాలు

భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద సాయుధ దళాల ఉద్యోగం అత్యంత ప్రమాదకరమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే దళంలో పనిచేసే సైనికుడు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశానికి సేవ చేయాలి. యుద్దాలు కూడా చేయాలి.

2. ఎలక్ట్రీషియన్

ఫీల్డ్‌లో పనిచేసే విద్యుత్ కార్మికులు కూడా చాలా ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. చిన్న పొరపాటు కూడా వారి ప్రాణాలు తీస్తుంది. అనుక్షణం ప్రమాదంతో కూడుకున్న ఉద్యోగంగా చెప్పవచ్చు.

3. పోలీసు

పోలీసులు ఎల్లప్పుడూ పౌరుల భద్రత కోసం పనిచేస్తారు. వీరి ఉద్యోగాలు కూడా కత్తిమీద సాములాంటిదే. కాల్పుల సమయంలో బుల్లెట్ గాయాల కారణంగా చాలా మంది పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే.

4. అగ్నిమాపక దళం

నగరంలో ఏ ప్రదేశంలోనైనా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ప్రజలు మొదట అగ్నిమాపక దళానికి కాల్ చేస్తారు. కానీ అందులో పనిచేసే వ్యక్తుల జీవితాలు ఎల్లప్పుడూ ప్రమాదంలో ఉంటాయి. చాలా సార్లు అగ్నిమాపక దళంలోని సిబ్బంది ప్రజలను కాపాడే పరిస్థితిలో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి.

5. బాంబ్ స్క్వాడ్

బాంబ్ స్క్వాడ్ అంటే బాంబ్ ప్రివెన్షన్ స్క్వాడ్. దీనికి ప్రాణహాని ఎప్పుడూ ఉంటుంది. బాంబును నిర్వీర్యం చేస్తున్నప్పుడు పొరపాటున ఏదైనా రాంగ్ వైరు తెగిపోతే బ్లాస్ట్‌ అవుతుంది. వారి ప్రాణాలు కాపాడే అవకాశం కూడా ఉండదు. అందుకే ఇది అత్యంత ప్రమాదకరమైన ఉద్యోగం.

6. మునిసిపల్‌ కార్మికులు

మునిసిపాల్టీలో పనిచేసే కార్మికులు మురుగునీటిలోపల ఉండే విషవాయువుతో తరచూ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇది కాకుండా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. ఈ ఉద్యోగం వల్ల జీవితాలు కోల్పోయిన కార్మికులు ఎంతో మంది ఉన్నారు.

7. రా ఏజెంట్

భారతదేశ గూఢచార సంస్థలో పనిచేస్తున్న RAW ఏజెంట్ జీవితం కూడా ప్రమాదంతో కూడుకున్నది. ఇందులో పనిచేసే ఏజెంట్లని ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని చంపెస్తుంటారు. ఇది కూడా దేశ భద్రతకి సంబంధించిన ఉద్యోగం.

Show Full Article
Print Article
Next Story
More Stories