IOCL Recruitment 2022: ఐవోసీఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. అర్హులు ఎవరంటే..?

IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) వివిధ ట్రేడ్‌లలో ట్రేడ్/టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

Arun Chilukuri
Published on: 5 Nov 2022 3:21 PM IST
IOCL Recruitment 2022 265 Apprentices Posts
X

IOCL Recruitment 2022: ఐవోసీఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. అర్హులు ఎవరంటే..?

IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) వివిధ ట్రేడ్‌లలో ట్రేడ్/టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఇచ్చిన నిర్దిష్ట విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. 12 నవంబర్ 2022 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. వివిధ ట్రేడ్‌లలో మొత్తం 265 ట్రేడ్/టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులని భర్తీ చేయనున్నారు.

మొత్తం 265 పోస్టులలో తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ ప్రాంతాలకి కేటాయించారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://apprenticeshipindia.org/candidates-registration సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హతలు,వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ మొదలైన వివరాలను నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం నోటిఫికేషన్ డౌన్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలి

1. నోటిఫికేషన్‌ను డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://iocl.com/apprenticeships ని సందర్శించాలి.

2. తర్వాత రిక్రూట్‌మెంట్ విభాగానికి వెళ్లాలి.

3. ఇప్పుడు IOCL-సదరన్ రీజియన్ (MD) వద్ద అప్రెంటీస్ చట్టం, 1961 కింద 265 మంది ట్రేడ్ అప్రెంటీస్‌ల ఎంగేజ్‌మెంట్ లింక్‌ను చూస్తారు. దానిపై క్లిక్ చేయాలి.

4. దీనిపై క్లిక్ చేస్తే IOCL అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2022 జాబ్ నోటిఫికేషన్ ఓపెన్‌ అవుతుంది.

5. దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story