ఇంజనీరింగ్‌, ఐటీఐ విద్యార్థులకి శుభవార్త.. ఇండియన్ ఆయిల్ కంపెనీలో 1760 ఉద్యోగాలు..!

IOCL Recruitment 2022-23 1760 Posts Check for all Details
x

ఇంజనీరింగ్‌, ఐటీఐ విద్యార్థులకి శుభవార్త.. ఇండియన్ ఆయిల్ కంపెనీలో 1760 ఉద్యోగాలు..!

Highlights

ఇంజనీరింగ్‌, ఐటీఐ విద్యార్థులకి శుభవార్త.. ఇండియన్ ఆయిల్ కంపెనీలో 1760 ఉద్యోగాలు..!

IOCL Recruitment 2022-23: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) టెక్నీషియన్, గ్రాడ్యుయేట్, ట్రేడ్ అప్రెంటీస్ (టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకి www.iocl.com/apprenticeshipsలో 14 డిసెంబర్ 2022 నుంచి 03 జనవరి 2023 వరకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 1760 ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయోపరిమితి 24 సంవత్సరాలుగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్రెంటిస్‌గా నమోదు చేసుకోవాలి.

ట్రేడ్ అప్రెంటిస్: NCVT / SCVT ద్వారా గుర్తింపు పొందిన రెగ్యులర్ ఫుల్ టైమ్ 2 సంవత్సరాల ITI కోర్సుతో పాటు మెట్రిక్యులేషన్ ఉండాలి.

టెక్నీషియన్ అప్రెంటీస్ (మెకానికల్): జనరల్, EWS & OBC-NCL కోసం కనీసం 50% మార్కులతో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుంచి ఇంజనీరింగ్‌లో 3 సంవత్సరాలు, రిజర్వు చేసిన స్థానాలకు SC/ST/PWBD అభ్యర్థులైతే 45% మార్కులతో రెగ్యులర్ ఫుల్ టైమ్ డిప్లొమా కలిగి ఉండాలి.

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (BA/B.Com/B.Sc): గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ నుంచి జనరల్, EWS, OBC-NCL, SC/ST/PWBD అభ్యర్థులకు కనీసం 50% శాతం మార్కులతో పాస్‌ అయి ఉండాలి. ఇతర వివరాల కోసం కంపెనీ వెబ్‌సైట్‌ని తనిఖీ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories