Indian Navy 2022: పదో తరగతి ఐటీఐ చదివారా.. ఇండియన్ నేవీలో 338 పోస్టులు..!

Indian Navy Recruitment 2022 338 Apprentice Posts in Indian Navy
x

Indian Navy 2022: పదో తరగతి ఐటీఐ చదివారా.. ఇండియన్ నేవీలో 338 పోస్టులు..!

Highlights

Indian Navy 2022: పదో తరగతి ఐటీఐ చదివిన విద్యార్థులకి ఇది శుభవార్తని చెప్పొచ్చు.

Indian Navy 2022: పదో తరగతి ఐటీఐ చదివిన విద్యార్థులకి ఇది శుభవార్తని చెప్పొచ్చు. ఇండియన్‌ నేవీ ముంబాయిలోని నావెల్‌ డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దాదాపు 338 పోస్టులని భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కి సంబంధించి ఇతర వివరాలని తెలుసుకుందాం.

విభాగాలు: ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, మెరైన్ ఇంజిన్ ఫిట్టర్, ఫౌండ్రీ మ్యాన్, ప్యాటర్న్ మేకర్, మెకానిక్ డీజిల్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, పెయింటర్ (జనరల్), షీట్ మెటల్ వర్కర్, పైప్ ఫిట్టర్, మెకానిక్ రెఫ్ అండ్‌ ఏసీ, టైలర్ వంటి ఇతర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధులు ఆగస్టు 1, 2001 నుంచి అక్టోబర్‌ 31, 2008 మధ్య జన్మించి ఉండాలి.

ఐటీఐ అభ్యర్ధులకు నెలకు రూ. 7,000, ఐటీఐ లేని అభ్యర్ధులకు నెలకు రూ. 6,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. పదో తరగతిలో 50 శాతం మార్కులతోపాటు, పోస్టునుబట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన స్త్రీ, పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పోస్టునుబట్టి రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ట్రేడ్‌ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆఫ్‌లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ జులై 11, 2022గా నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories