India Post: ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా పొందే అవకాశం..!

India Post: ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా పొందే అవకాశం..!

Rama Rao
Updated on: 14 July 2022 6:00 PM IST
India Post Recruitment 2022 Notification
X

India Post: ఇండియా పోస్ట్‌లో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా పొందే అవకాశం..!

India Post: పదోతరగతి చదివిన నిరుద్యోగులకి ఇది శుభవార్తనే చెప్పాలి. ఇండియన్ పోస్ట్‌ నుంచి జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. స్టాప్‌కార్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్ట్‌లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు indiapost.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ జూలై 20, 2022గా నిర్ణయించారు. అంతేకాదు అభ్యర్థులు https://www.indiapost.gov.in/vas/Pages.లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ క్యాంపెయిన్ కింద మొత్తం 24 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

1. దరఖాస్తుకు చివరి తేదీ - జూలై 20

2. మొత్తం పోస్టుల సంఖ్య- 24

3. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

4. దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయోపరిమితి 56 ఏళ్లు మించకూడదు.

5. అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను నింపి, సీనియర్ మేనేజర్ (JAG), మెయిల్ మోటార్ సర్వీస్, నం. 37, గ్రీమ్స్ రోడ్, చెన్నై- 600006కు పంపవచ్చు.

Rama Rao

Rama Rao

Next Story