Short Term Courses: ఈ షార్ట్‌టర్మ్‌ కోర్సులు చేస్తే మంచి ఉద్యోగాలు.. వేలల్లో జీతాలు..!

If you do These Short Term Courses You Can Get a Good Job and a Huge Salary Know that
x

Short Term Courses: ఈ షార్ట్‌టర్మ్‌ కోర్సులు చేస్తే మంచి ఉద్యోగాలు.. వేలల్లో జీతాలు..!

Highlights

Short Term Courses: ఈ షార్ట్‌టర్మ్‌ కోర్సులు చేస్తే మంచి ఉద్యోగాలు.. వేలల్లో జీతాలు..!

Short Term Courses: విద్యార్థులు ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేసిన తర్వాత మంచి ఉద్యోగం ఎలా పొందాలనే దానిపై వారి దృష్టి ఉంటుంది. ఇలాంటి వారు కొన్ని షార్ట్‌టర్మ్‌ కోర్సులు చేస్తే మంచి జీతంతో ఉద్యోగం పొందవచ్చు. అంతేకాకుండా సొంతంగా స్టార్టప్‌ను కూడా ప్రారంభించవచ్చు. అలాంటి కోర్సులు మార్కెట్‌లో చాలా ఉన్నాయి. అయితే అందులో కొన్ని డిమాండ్‌ ఉన్న కోర్సుల గురించి ఈరోజు తెలుసుకుందాం.

ఫ్యాషన్ డిజైనింగ్

మీరు ఫ్యాషన్‌పై ఆసక్తి ఉంటే ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో కెరీర్ చేయవచ్చు. ఇందులో విద్యార్థులకు ఫ్యాషన్ పరిశ్రమతో పాటు డిజైనింగ్ పద్ధతులు, సాంకేతికత మొదలైన వాటి గురించి చెబుతారు. ఫ్యాషన్ డిజైనర్ ప్రారంభ వేతనం దాదాపు రూ.30 నుంచి 40 వేలు ఉంటుంది. ఈ కోర్సులు షార్ట్ టర్మ్ మాత్రమే ఉండవు డిగ్రీ, డిప్లొమా కూడా ఉంటాయి. భారతదేశంలో ఇలాంటి కోర్సులను అందించే అనేక ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి.

వెబ్ డిజైనింగ్

వెబ్ డిజైనింగ్ అంటే విద్యార్థుల్లో చాలా క్రేజ్ ఉంటుంది. 12వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ పాస్ వరకు ఎవరైనా ఈ కోర్సు చేయవచ్చు. ఈ కోర్సు వ్యవధి కనీసం 03 నెలలు. అదే సమయంలో 09 నెలల కోర్సు కూడా ఉంటుంది. ఈ కోర్సు చేసిన తర్వాత వెబ్ డిజైనర్‌గా ఉద్యోగం పొందవచ్చు లేదా మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. భారతదేశంలో వెబ్ డిజైనర్ల ప్రారంభ వేతనం 40 నుంచి 50 వేల మధ్య ఉంటుంది.

యానిమేషన్

హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతిచోటా యానిమేషన్‌ అవసరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు యానిమేషన్‌లో షార్ట్‌టర్మ్ కోర్సులు చేయడం వల్ల మంచి ఉద్యోగం పొందవచ్చు. యానిమేటర్ వీడియో పరిశ్రమ, గేమ్, ప్రత్యేక డిజైన్ కంపెనీలలో ఉద్యోగాలు పొందవచ్చు. అవసరమైతే సొంత స్టార్టప్‌ను ప్రారంభించవచ్చు. భారతదేశంలో యానిమేటర్ ప్రారంభ జీతం దాదాపు 40 నుంచి 50 వేలు ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories