నిరుద్యోగులకి సువర్ణవకాశం.. పదో తరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..

IB Recruitment 2022 1671 Jobs Check for all Details
x

నిరుద్యోగులకి సువర్ణవకాశం.. పదో తరగతితో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..

Highlights

IB Recruitment 2022: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) సెక్యూరిటీ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది.

IB Recruitment 2022: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) సెక్యూరిటీ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. అయితే అభ్యర్థులు నవంబర్ 25 వరకు అప్లై చేసుకోవచ్చు. దీని కోసం వారు అధికారిక వెబ్‌సైట్ mha.gov.inని సందర్శించాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 1671 పోస్టులు భర్తీ చేస్తారు. ఇందులో 1521 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు, 150 ఎంటీఎస్‌ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి 10వ తరగతి పాస్‌ అయి ఉండాలి. అలాగే అభ్యర్థికి స్థానిక భాషపై అవగాహన కలిగి ఉండాలి. హైదారాబాద్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.

వయోపరిమితి 25.11.22 నాటికి ఎస్‌ఏ/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 25 ఏళ్లు, ఎంటీఎస్‌ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు. ఎంపికైన అభ్యర్థులకి నెలకు సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.21700 నుంచి రూ.69100, ఎంటీఎస్‌ పోస్టులకు రూ.18000 నుంచి రూ.56900 చెల్లిస్తారు. టైర్-1, టైర్-2, టైర్-3 పరీక్షల ఆధారంగా ఉద్యోగ ప్రక్రియ ఉంటుంది. పరీక్ష ఫీజు రూ.500 చెల్లించాలి. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://www.mha.gov.in/ సందర్శించండి.

Show Full Article
Print Article
Next Story
More Stories