ఐటీఐ విద్యార్థులకి బంపర్‌ ఆఫర్.. హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు..

Hal Recruitment 2022: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, నాసిక్ డివిజన్.. అప్రెంటిస్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Arun Chilukuri
Updated on: 9 Aug 2022 1:31 PM IST
HAL Recruitment 2022 Apprentice Posts in Hindustan Aeronautics Ltd
X

ఐటీఐ విద్యార్థులకి బంపర్‌ ఆఫర్.. హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు..

Hal Recruitment 2022: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, నాసిక్ డివిజన్.. అప్రెంటిస్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 455 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌లు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 10, 2022. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ hal-india.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగం పొందడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి చదివి ఉండాలి. అంతే కాకుండా అభ్యర్థి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) లేదా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ (SCVT) ద్వారా ట్రేడ్‌లో ITI పాస్ అయి ఉండాలి. సర్టిఫికేట్ కలిగి ఉండటం అత్యవసరమని గుర్తుంచుకోండి.

1. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి ప్రారంభ తేదీ: జూలై 22, 2022

2. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ: ఆగస్టు 10, 2022

3. మొత్తం ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు 455

4. అప్రెంటిస్ చట్టం 1961 ప్రకారం చెల్లిస్తారు.

5. అర్హత ప్రమాణాలు: అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లలో ITI ఉత్తీర్ణులై ఉండాలి.

6. ఆసక్తి ఉన్న అభ్యర్థులు hal-india.co.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.

7. ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story