త్వరలో ఫుడ్‌ కార్పొరేషన్‌ ఇండియాలో ఉద్యోగాలు.. 8,10 చదివిన వారు అర్హులు..!

FCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) త్వరలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

Arun Chilukuri
Updated on: 21 July 2022 7:45 PM IST
FCI Recruitment 2022 4700 Jobs Studied 8,10 are Eligible
X

త్వరలో ఫుడ్‌ కార్పొరేషన్‌ ఇండియాలో ఉద్యోగాలు.. 8,10 చదివిన వారు అర్హులు..!

FCI Recruitment 2022: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) త్వరలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకి ఇది ఒక చక్కటి అవకాశమని చెప్పొచ్చు. FCI నోటీసు ప్రకారం II, III, IV కేటగిరీల పోస్టులని భర్తీ చేయనున్నారు. మొత్తం 4710 ఉద్యోగాలు ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత అభ్యర్థులు FCI వెబ్‌సైట్‌ను సందర్శించి అప్లై చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు

కేటగిరీ II – 35 పోస్ట్‌లు

కేటగిరీ III – 2521 పోస్ట్‌లు

కేటగిరీ IV (వాచ్‌మ్యాన్) – 2154 పోస్ట్‌లు

ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్

అభ్యర్థులు 8వ/10వ తరగతి పాస్/గ్రాడ్యుయేట్ చదివి ఉండాలి.

ఎంపిక ప్రమాణాలు

రాత పరీక్ష, శారీరక దారుఢ్య పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story