ECIL Recruitment 2022: ఈసీఐఎల్‌లో ఇంటర్వూ ద్వారా ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి..!

ECIL Recruitment 2022: ఈసీఐఎల్‌లో ఇంటర్వూ ద్వారా ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి..!

Rama Rao
Updated on: 12 Jun 2022 5:58 PM IST
ECIL Recruitment 2022 Various Types of Jobs Through Interview in ECIL
X

ECIL Recruitment 2022: ఈసీఐఎల్‌లో ఇంటర్వూ ద్వారా ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి..!

ECIL Recruitment 2022: హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ECIL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో టెక్నికల్ ఆఫీసర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. వీటికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులని ఎంపిక చేస్తారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి మొదలైన వివరాల గురించి తెలుసుకుందాం.

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 08 ఉద్యోగాలని భర్తీ చేస్తారు. ఇందులో ఒకటి టెక్నికల్‌ ఆఫీసర్‌ ఏడు సైంటిఫిక్‌ అసిస్టెంట్లు పోస్టులు ఉన్నాయి.టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఏడాది అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదని గుర్తుంచుకోండి.

సైంటిఫిక్‌ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఎంపికైన వారు ముంబై, సైంటిఫిక్‌ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారు గౌరిబిదనూర్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకి సెలక్ట్‌ అయిన అభ్యర్థులకు నెలకి రూ. 21,000 నుంచి రూ. 25,000 వరకు జీతం చెల్లిస్తారు. ఇంటర్వ్యూలను 17-06-2022వ తేదీని సంబంధిత ఈసీఐఎల్‌ జోనల్‌ కార్యాలయాల్లో నిర్వహిస్తారు.

Rama Rao

Rama Rao

Next Story