నిరుద్యోగులకి బంపర్‌ ఆఫర్.. సీఆర్ఫీఎఫ్‌లో 1458 ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు..!

CRPF Recruitment 2022 1458 Assistant Sub Inspector and Head Constable Posts
x

నిరుద్యోగులకి బంపర్‌ ఆఫర్.. సీఆర్ఫీఎఫ్‌లో 1458 ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు..!

Highlights

CRPF Recruitment 2022: సెంట్రల్‌ రిజర్వ్ పోలీస్‌ ఫోర్స్‌ 1458 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

CRPF Recruitment 2022: సెంట్రల్‌ రిజర్వ్ పోలీస్‌ ఫోర్స్‌ 1458 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన మహిళా, పురుష అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఇందులో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు 143, హెడ్ కానిస్టేబుల్ పోప్టులు 1315 వరకు ఉన్నాయి. అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సు పాస్‌ అయి ఉండాలి.

పురుషుల ఎత్తు 165 సెంటీమీటర్లు, మహిళల ఎత్తు 155 సెంటీమీటర్లు ఉండాలి. అభ్యర్ధుల వయసు జనవరి 25, 2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 25, 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు జనవరి 4, 2023 నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు సమయంలో జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు నిర్వహిస్తారు. ఎంపికైన వారికి ఏఎస్సై పోస్టులకు నెలకు రూ.29,200ల నుంచి రూ.92,300లు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్‌ తనిఖీ చేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories