సాఫ్ట్‌వేర్ ఫ్రెషర్లకు పండగే: 25 వేల మందిని తీసుకోనున్న కాగ్నిజెంట్‌.. రిక్రూట్‌మెంట్‌లో ఏఐ నిపుణులదే హవా!

Cognizant to Hire 25,000 Freshers in 2026: నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా ఐటీ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే ఫ్రెషర్లకు ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ (Cognizant) శుభవార్త చెప్పింది.

Arun Chilukuri
Published on: 5 Feb 2026 1:06 PM IST
సాఫ్ట్‌వేర్ ఫ్రెషర్లకు పండగే: 25 వేల మందిని తీసుకోనున్న కాగ్నిజెంట్‌.. రిక్రూట్‌మెంట్‌లో ఏఐ నిపుణులదే హవా!
X

Cognizant to Hire 25,000 Freshers in 2026: నిరుద్యోగ యువతకు, ముఖ్యంగా ఐటీ రంగంలోకి అడుగుపెట్టాలనుకునే ఫ్రెషర్లకు ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ (Cognizant) శుభవార్త చెప్పింది. 2026 సంవత్సరంలో సుమారు 25,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు సంస్థ సీఈవో రవి కుమార్‌ ఎస్‌ అధికారికంగా ప్రకటించారు.

వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా ఈ భారీ రిక్రూట్‌మెంట్‌ చేపడుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. 2025లో సంస్థ 20,000 మందిని నియమించుకోగా, ఈ ఏడాది ఆ సంఖ్యను మరో 20 శాతం పెంచి 24,000 నుంచి 25,000 కు పెంచడం విశేషం. గతేడాది కంపెనీ ఆదాయంలో 6.4 శాతం వృద్ధి నమోదవ్వడం, అలాగే ఒక్కో ఉద్యోగి నుంచి వచ్చే ఆదాయం 5 శాతం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈవో తెలిపారు.

కొత్తగా ఉద్యోగాల్లోకి చేరబోయే అభ్యర్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీపై మంచి పట్టు ఉండాలని కంపెనీ స్పష్టం చేసింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఏఐ నైపుణ్యాలు ఉన్నవారికే రిక్రూట్‌మెంట్‌లో ప్రాధాన్యత ఉంటుందని రవి కుమార్ పేర్కొన్నారు. ఐటీ రంగం మందగమనంలో ఉందన్న ఆందోళనల మధ్య కాగ్నిజెంట్‌ తీసుకున్న ఈ నిర్ణయం నిరుద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story