పోలీస్ ఉద్యోగం సాధించాలనుకునే వారికి సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్

TS Police Jobs 2022: తెలంగాణలో భారీ స్థాయిలో చేపడుతోన్న పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వయో పరిమితిని పెంచాలని కొన్ని రోజులుగా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Updated on: 20 May 2022 3:31 PM IST
CM KCR Hikes Limit age of 2 Years in Police Recruitment
X

పోలీస్ ఉద్యోగం సాధించాలనుకునే వారికి సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్

TS Police Jobs 2022: తెలంగాణలో భారీ స్థాయిలో చేపడుతోన్న పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వయో పరిమితిని పెంచాలని కొన్ని రోజులుగా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడేళ్లు వయోపరిమితి పెంచిన ప్రభుత్వం అభ్య‌ర్థుల విజ్ఞ‌ప్తుల మేర‌కు మ‌రో రెండేండ్ల వ‌యోప‌రిమితిని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకున్నారు. పోలీసు ఉద్యోగ అభ్య‌ర్థుల విన్న‌పాల‌ను ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ల‌గా సానుకూలంగా స్పందించారు.

ఇందుకు సంబంధించి త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్‌ను, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. కాగా, దరఖాస్తు ప్రక్రియ గడువును ఎట్టిపరిస్థితుల్లో పొడిగించేది లేదని పోలీసు నియామక మండలి గతంలోనే తేల్చి చెప్పింది. గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేందుకు మరికొంత సమయాన్ని ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఈ నేప‌థ్యంలో ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ గ‌డువు పొడిగించే విష‌యంపై సాయంత్రం వ‌ర‌కు స్ప‌ష్ట‌త రానుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story