CBI Recruitment 2023: బ్యాంకు ఉద్యోగమంటే ఇష్టమా.. సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 5000 పోస్టులు..!

Central Bank of India Recruitment 2023 for 5000 Apprentice Posts Check for all Details
x

CBI Recruitment 2023: బ్యాంకు ఉద్యోగమంటే ఇష్టమా.. సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 5000 పోస్టులు..!

Highlights

CBI Recruitment 2023: మీరు బ్యాంకింగ్ రంగంలో కెరీర్ చేయాలనుకుంటే ఈ వార్త బాగా ఉపయోగపడుతుంది.

CBI Recruitment 2023: మీరు బ్యాంకింగ్ రంగంలో కెరీర్ చేయాలనుకుంటే ఈ వార్త బాగా ఉపయోగపడుతుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద దేశవ్యాప్తంగా 5,000 అప్రెంటిస్‌ల పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగంపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ centralbankofindia.co.inని సందర్శించి అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 3 ఏప్రిల్ 2023 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన అర్హతను కలిగి ఉండాలి. మొత్తం ఖాళీల్లో తెలంగాణ నుంచి (హైదరాబాద్‌ 65, వరంగల్‌ 41 ) ఖాళీల్ని భర్తీ చేయనుండగా ఏపీ నుంచి 141 (విజయవాడ రీజన్‌లో 41, గుంటూరు 60, విశాఖ 40) భర్తీ చేయనున్నారు. శిక్షణ కాలం ఒక యేడాది పాటు ఉంటుంది. ఈ అప్రెంటిస్‌షిప్‌కు ఎంపికయ్యే వారికి రూరల్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, అర్బన్ శాఖల్లో రూ.12 వేలు, మెట్రో నగరాల్లో రూ.15 వేల చొప్పున స్టైఫండ్ చెల్లిస్తారు.

కేటగిరీ వారీగా ఖాళీలు

జనరల్‌- 2159, ఎస్సీ- 763, ఎస్టీ- 416, ఓబీసీ- 1162, ఈడబ్ల్యూఎస్‌- 500 ఖాళీలు ఉన్నాయి. మార్చి 31 నాటికి 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయసు సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్‌, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్‌ అనుసరించి ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.800, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.600, దివ్యాంగులకు రూ.400 ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories