BEL Recruitment 2023: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు.. నెలకు రూ.55 వేల జీతం..

BEL Recruitment 2023: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Arun Chilukuri
Updated on: 6 May 2023 8:00 PM IST
BEL Bengaluru Recruitment 2023 for 428 Posts, Apply Online
X

BEL Recruitment 2023: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగావకాశాలు.. నెలకు రూ.55 వేల జీతం..

BEL Recruitment 2023: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈఎల్ బెంగళూరు నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, కెమికల్, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పోస్టులను కాంట్రాక్ట్ బేస్ పై భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఆన్ లైన్ లో ఇప్పటికే ప్రారంభం కాగా మే 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

మొత్తం పోస్టులు : 428

పోస్టులు : ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ట్రెయినీ ఇంజినీర్‌

అర్హత: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

వ‌య‌స్సు : పోస్టుల‌ను బ‌ట్టి 28 నుంచి 32 ఏండ్లు మించ‌కుడ‌దు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

జీతం : రూ.30000 నుంచి రూ.55000

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

అడ్రస్ : ఔటర్ రింగ్ రోడ్, నాగవర బెంగళూరు: 560045 కర్ణాటక, భారతదేశం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story