AP: గ్రూప్-1,2 నోటిఫికేషన్లకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP: త్వరలో నోటిఫికేషన్ రిలీజ్

Jyothi
Published on: 25 May 2023 3:43 PM IST
AP Govt Gives Green Signal to Group-1 And Group-2  Exam Notification
X

AP: గ్రూప్-1,2 నోటిఫికేషన్లకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP: ఏపీలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోస్టుల భర్తీకి సంబంధించి అధికారులు వివరాలు అందించడంతో..వీలైనంత త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గ్రూప్ 1,2 పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని సంబంధిత అధికారులు వెల్లడించారు. గ్రూప్‌-1కి సంబంధించి సుమారు 100 కిపైగా పోస్టులు, గ్రూప్‌-2కు సంబంధించి తొమ్మిది వందలకు పైగా పోస్టులు.. మొత్తం వెయ్యికి పైగా పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story