AP Constable Results: ఏపీ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల

AP Constable Results: ఉత్తీర్ణత సాధించిన 95,208 మంది అభ్యర్థులు

Dhatripriya
Published on: 5 Feb 2023 1:06 PM IST
AP Constable Exam Result Released
X

AP Constable Results: ఏపీ కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు విడుదల

AP Constable Results: ఏపీ కానిస్టేబుల్‌ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. కానిస్టేబుల్‌ పరీక్షకు 4లక్షల 59వేల 182 మంది అభ్యర్థులు హాజరుకాగా 95వేల 208 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. గత నెల 22వ తేదీన కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించారు. ఇందుకు గాను 997 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదే రోజు పరీక్షా కీ విడుదల చేసిన రిక్రూట్‌మెంట్‌ బోర్డు 25వ తేదీ వరకూ కీపై అభ్యంతరాలకు సమయం ఇచ్చింది. ఇక ఈరోజు ఫలితాల్ని విడుదల చేశారు. ఈ నెల 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో OMR షీట్లు అందుబాటులో ఉంటాయని పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది.

Dhatripriya

Dhatripriya

Next Story