డిప్లొమా,ఇంజినీరింగ్ విద్యార్థులకి సువర్ణవకాశం.. సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డ్‌నెన్స్ కార్ప్స్‌లో 419 ఉద్యోగాలు..

AOC Secunderabad Recruitment 2022 Check for all Details
x

డిప్లొమా,ఇంజినీరింగ్ విద్యార్థులకి సువర్ణవకాశం.. సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డ్‌నెన్స్ కార్ప్స్‌లో 419 ఉద్యోగాలు..

Highlights

AOC Recruitment 2022: డిప్లొమా,ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులకి ఇది శుభవార్తని చెప్పాలి.

AOC Recruitment 2022: డిప్లొమా,ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులకి ఇది శుభవార్తని చెప్పాలి. సికింద్రాబాద్‌లోని సెంట్రల్ రిక్రూట్‌మెంట్ సెల్, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ వివిధ రీజియన్లలో మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గ్రాడ్యుయేషన్‌/డిప్లొమా ఇంజనీరింగ్‌/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 23న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబరు 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా18 నుంచి 27 యేళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో నోటిఫికేషన్‌ విడుదలైన 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. సరైన అర్హతలున్న వారు రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, సర్టిఫికేట్ల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.29,200 నుంచి రూ.92,300 జీతం ఉంటుంది.

మొత్తం 419 పోస్టులు

రిజర్వేషన్లు: జనరల్ - 171, ఈడబ్ల్యూఎస్ - 42, ఓబీసీ - 113, ఎస్సీ - 62, ఎస్టీ - 31. మొత్తం పోస్టుల్లో ఎక్స్-సర్వీస్‌మెన్లకు 41, స్పోర్ట్స్ పర్సన్స్-20, దివ్యాంగులకు 16 కేటాయించారు.

రీజియన్ల వారీగా ఖాళీలు: ఈస్ట్రన్- 10, వెస్ట్రన్-120, నార్తర్న్- 23, సదరన్- 32, సౌత్ వెస్ట్రన్- 23, సెంట్రల్ వెస్ట్- 185, సెంట్రల్ ఈస్ట్- 26.

ఎంపిక ప్రక్రియ

రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్/ స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్-50 ప్రశ్నలు-50 మార్కులు, న్యూమరిక్ ఆప్టిట్యూడ్-25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ అవేర్‌నెస్-25 ప్రశ్నలు-25 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటలు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories