APRJC 2022: విద్యార్థులకి అలర్ట్‌.. మే 20తో ముగుస్తున్న ఏపీఆర్‌జేసీ 2022 దరఖాస్తు గడువు..!

Alert APRJC 2022 Application Deadline Ending May 20
x

APRJC 2022: విద్యార్థులకి అలర్ట్‌.. మే 20తో ముగుస్తున్న ఏపీఆర్‌జేసీ 2022 దరఖాస్తు గడువు..!

Highlights

APRJC 2022: ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు చదువు ఆపకూడదని వారు ఉన్నత చదువులు చదవాలని ప్రభుత్వం గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలలని ఏర్పాటు చేసింది.

APRJC 2022: ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు చదువు ఆపకూడదని వారు ఉన్నత చదువులు చదవాలని ప్రభుత్వం గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలలని ఏర్పాటు చేసింది. ఇందులో సీటు వస్తే నాణ్యమైన విద్యను ఉచితంగా పొందవచ్చు. అంతేకాదు భోజన, వసతులని కూడా సమకూరుస్తారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఏపీఆర్‌జేసీ నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఎందుకంటే మే 20 తో దరఖాస్తుల గడువు ముగుస్తుంది.

ప్రవేశ పరీక్షకు దరఖాస్తు రుసుము చెల్లించిన తర్వాత వచ్చే గుర్తింపు సంఖ్యతో దరఖాస్తు పూర్తి చేయాలని సూచించారు. కేవలం దరఖాస్తు రుసుము చెల్లించినంత మాత్రాన దరఖాస్తు సమర్పించినట్లు కాదని ఇప్పటి వరకు దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు వ్యక్తిగత వివరాలలో మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించామని కన్వీనర్‌ సోమదత్త తెలిపారు. ఆర్‌జేసీసెట్‌-2022 ప్రవేశ పరీక్ష ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాన్ని పొందవచ్చు. 2021-22 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. అంతకుముందు సంవత్సరాల్లో చదివినవారు ప్రవేశానికి అర్హులు కారు. విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌కు చెంది, ఈ రాష్ట్రంలోనే చదివినవారై ఉండాలి.

అలాగే 2022-23 విద్యాసంవత్సరానికి గానూ ఏపీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా ఇంటర్‌, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ (APREI) ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 28 న ప్రారంభమైంది. జూన్‌ 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష జరగనుంది. దీనికి అర్హులైన అభ్యర్థులు కూడా వెంటనే అప్లై చేసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories