జోమాటో డెలివరీ బాయ్ నిర్వాకం.. కుక్కను ఎత్తుకెళ్లిపోయాడు!

జోమాటో డెలివరీ బాయ్ నిర్వాకం.. కుక్కను ఎత్తుకెళ్లిపోయాడు!
x
Highlights

ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన వ్యక్తి ఆ ఇంటి పెంపుడు కుక్కను ఎత్తుకుపోయారు. ఈ సంఘటన పూణేలో చోటు చేసుకుంది. వందనా షా జొమాటో యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్...

ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన వ్యక్తి ఆ ఇంటి పెంపుడు కుక్కను ఎత్తుకుపోయారు. ఈ సంఘటన పూణేలో చోటు చేసుకుంది. వందనా షా జొమాటో యాప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసింది. కొద్దీ సేపటికి తుషార్ అనే డెలివరీ బాయ్ ఆమెకు ఆహారాన్ని తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆటను వెళ్లిన తరువాత వందన తన కుక్క పిల్ల దొత్తు కోసం చూసింది. అయితే అది కనిపించలేదు. దాంతో ఆమె ఇంటి చుట్టుపక్కల వెతికింది. అయినా ఫలితం కనిపించలేదు. ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించగా ఇంటి చుట్టుపక్కల దొత్తు ఆడుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. కానీ, ఎవరూ ఎత్తుకు వెళ్లినట్టు కనిపించలేదు.

వందన చుట్టూ పక్కల వారిని.. రోడ్డున ఉన్నవాస్తోరిని దొత్తు గురించి వాకబు చేయగా ఆమెకు మతి పోయే కబురు తెలిసింది. జొమాటో నుంచి ఫుడ్ తీసుకువచ్చిన వ్యక్తి కుక్కపిల్లను తీసుకు పోతుండగా చూశామని వారు చెప్పారు. దాంతో ఆమె ట్విట్టర్ ద్వారా జొమాటో కు ఫిర్యాదు చేసింది. తనకు ఆహరం తీసుకువచ్చిన తుషార్ అనే డెలివరీ బాయ్ తన కుక్క పిల్లను ఎత్తుకుపోయినట్టు చెప్పింది. దాంతో పాటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం తుషార్ తో ఫోన్ లో మాట్లాడింది. తాను ఆ కుక్క పిల్లను తన ఊరికి పంపించినట్ట్టు చెప్పాడు. తరువాత నుంచి అతని ఫోన్ స్విచాఫ్ లో ఉంది.


ఈ ఘటన పై జొమాటో స్పందించింది. కుక్క పిల్లను తిరిగి తెప్పించేందుకు సహకరిస్తామని చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేయలేదు కానీ, దత్తు ను తీసుకురావడంలో సహకరిస్తామని చెప్పారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories