Top
logo

యూపీలో దారుణం... యువకుడిని చంపి మెడను తాడుతో మోటారు సైకిల్‎కు కట్టి...

యూపీలో దారుణం... యువకుడిని చంపి మెడను తాడుతో మోటారు సైకిల్‎కు కట్టి...
X
Highlights

ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. అంతే కాకుండా శవాన్ని ద్విచక్రవాహనానికి కట్టి 15 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్‎లోని మీరట్‎లో చోటు చేసుకుంది.

ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు అతి దారుణంగా హత్య చేశారు. అంతే కాకుండా శవాన్ని ద్విచక్రవాహనానికి కట్టి 15 కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్‎లోని మీరట్‎లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం .. మీరట్ లోని హపూర్ గ్రామానికి చెందిన ముకుల్ కుమార్ (21)గత రెండు రోజులుగా కనిపించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మంగళవారం రాత్రి మీరట్ సమీపంలో మృతదేహం కనిపించిందని పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చెరుకున్న పోలీసులు ముకుల్ మృతదేహాన్ని గుర్తిచారు. కాగా.. ముకుల్ కుమార్ను కాల్చి చంపినట్లు పోలీసులు గుర్తిచారు. ముకుల్ తల వెనుక భాగంలో బుల్లేట్ ఉందని గాయాలు ఉన్నాయని వారు వెల్లడించారు.

అలాగే ముకుల్ మరణించిన అనంతరం మెడను తాడుతో మోటారు సైకిల్ కు కట్టి 15 కిలోమిటర్ల పైగా ఈడ్చుకెళ్లీన గుర్తులు కనిపించినట్లు తెలిపారు. అనరంతం ద్విచక్రవాహనాన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. స్నేహితులతో ఏవైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యా్ప్తు చేస్తున్నామని.. ముకుల్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపినట్లు పోలీసులు తెలిపారు.

Next Story