logo

భర్తను మట్టుబెట్టాలనుకుంది .... ఇలా దొరికిపోయింది

భర్తను మట్టుబెట్టాలనుకుంది .... ఇలా దొరికిపోయింది
Highlights

ప్రియుడితో శారీరక సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని కడతేర్చాలనే పథకం పన్నింది ఓ ఇల్లాలు. ఇది గ్రహించిన ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి ... గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన వ్యక్తి బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అదే ప్రాంతానికి చెందిన మహిళతో 7ఏళ్ల క్రితం వివాహమైంది.

కాగా.. భర్త పని నిమిత్తం తరచూ బయటకు వెళ్లడంతో ఆమె పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం గ్రహించిన భర్త ఆమెను హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె వినలేదు. దీంతో భర్తపై వేధింపుల కేసు పెట్టింది. భర్తకు దూరంగా ఉంటున్నప్రియుడితో హైదరాబాద్ ,గుంటూరు అన్ని ప్రాంతాలు తిరుగుతూ జల్సా చేస్తుంటుంది.

అయితే వారిపై ఆమె భర్త ఓ కన్నేసి ఉంచాడు, వారిద్దరి కాల్‌డేటా, మెసేజ్ వివరాలు, వారు తీసుకున్న ఫోటోలను సేకరించాడు. కాల్ రికార్డుల్లో వారి సంభాషణల్లో తనను చంపేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిసి షాకయ్యాడు. సోమవారం గుంటూరు పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన వద్దనున్న ఆధారాలను పోలీసులకు సమర్పించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు. భార్యే తనను చంపాలని చూస్తోందని పొలీసులకు మొరపెట్టుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

లైవ్ టీవి

Share it
Top