logo

మహిళా హోంగార్డ్ ఆత్మహత్య

మహిళా హోంగార్డ్ ఆత్మహత్య
Highlights

కుటుంబ కలహాలతో మహిళా హోంగార్డ్ ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ సైఫాబాద్‌లో అలివేలు హోంగార్డుగా పనిచేస్తున్నారు. భర్త, కూతురితో కలిసి ఆమె బోరబండలో నివాసం ఉంటున్నారు.

కుటుంబ కలహాలతో మహిళా హోంగార్డ్ ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ సైఫాబాద్‌లో అలివేలు హోంగార్డుగా పనిచేస్తున్నారు. భర్త, కూతురితో కలిసి ఆమె బోరబండలో నివాసం ఉంటున్నారు. అయితే, కొద్ది రోజులుగా కుటుంబంలో కలహాలు తలెత్తుతు న్నాయి. గురువారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా, రాత్రి 8 గంటల సమయంలో కూతురు రవళిక వచ్చి చూడగా తల్లి ఆపస్మారక స్థితిలో ఉంది. వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఆమెను హుటాహుటినా సనత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


లైవ్ టీవి


Share it
Top