లిప్ట్‌లో కాలు ఇరుక్కుని మహిళ..

లిప్ట్‌లో కాలు ఇరుక్కుని మహిళ..
x
Highlights

పెళ్లికని వెళ్లింది.. ప్రాణాలు కోల్పోయింది. రాజేంద్రనగర్ బండ్లగూడ కేకే కన్వెన్షన్ హాల్‌లో జరుగుతున్న బంధువుల వివాహానికి హాజరైంది ఓ మహిళ. ఆమె లిప్ట్...

పెళ్లికని వెళ్లింది.. ప్రాణాలు కోల్పోయింది. రాజేంద్రనగర్ బండ్లగూడ కేకే కన్వెన్షన్ హాల్‌లో జరుగుతున్న బంధువుల వివాహానికి హాజరైంది ఓ మహిళ. ఆమె లిప్ట్ ఎక్కి వెళుతుండగా కాలు లిప్ట్ డోర్‌లో ఇరుక్కుపోయింది. ఈలోపే లిప్ట్ ఒక్కసారిగా పైకీ కిందకు కదిలింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బాధతో ఆమె వేసిన కేకలకు బంధువులంతా ఒక్కసారిగా అక్కడకు వచ్చారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన అనంతరం కన్వెన్షన్ హాల్ యజమాని పరారయ్యాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories