గ్రామ వాలంటీర్ వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

గ్రామ వాలంటీర్ వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య
x
Highlights

ఓ గ్రామవాలంటీర్ వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్లం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవలే గ్రామ వాలంటీరుగా నియమితుడైన పల్లెపు మాధవ వర్మ అదే గ్రామానికి చెందిన మరో మహిళపై కన్నేశాడు. తన కోరిక తీర్చేలా ఒప్పించాలని వీరవేణిని కోరాడు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా గ్రామవాలంటీర్లు నియామకం కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే వాలంటీర్ల నియమితులైన వారు ప్రతీకుంటుబాకి రేషన్ సరుకులు అందజేయడం వారి విధి. కానీ ఓ గ్రామవాలంటీర్ వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్లం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తూర్పు గోదావరి జిల్లా గాడిమొగకు చెందిన మల్లాడి వీరవేణికి, పల్లం గ్రామానికి చెందిన మల్లాడి సత్యనారాయణతో 9ఏళ్ల క్రితం వివాహమైంది.రవేణికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇటీవలే గ్రామ వాలంటీరుగా నియమితుడైన పల్లెపు మాధవ వర్మ అదే గ్రామానికి చెందిన మరో మహిళపై కన్నేశాడు. తన కోరిక తీర్చేలా ఒప్పించాలని వీరవేణిని కోరాడు. అందుకు వీరవేణి నిరాకరించింది అతనికి చీవాట్లు కూడా పెట్టింది. అప్పటికి వేధింపులకు గురిచేస్తుండంతో పెద్దమనుషుల వద్ద పంచాయితీ పెట్టింది. పెద్దమనుషులు మాధవ వర్మకు తప్పుగా నిర్ధారించి హెచ్చరిచారు.

అయితే అవమానంగా భావించిన మాధవ వర్మ అతని స్నేహితులతో పల్లెపు వర్మ, కృష్ణ, పల్లెపు వెంకటవర్మ, కలిసి వీరవేణిని తీవ్రంగా దూషించారు. అవమానం తట్టుకోలేకపోయిన వీరవేణి తన చావుకు వాలంటీర్ మాధవ వర్మ కారణమని లేఖ రాసి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వీరవేణి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. వీతన భార్య చావుకి వాలంటీర్ పల్లెపు మాధవ వర్మ, అతని స్నేహితులు కారణమని వీరవేణి భర్త ఆదినారాయణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories