Top
logo

మహిళపై సామూహిక లైంగికదాడి

మహిళపై సామూహిక లైంగికదాడి
Highlights

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. 23 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగు మృగాళ్లు. ఈ ఘటన ...

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. 23 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగు మృగాళ్లు. ఈ ఘటన ముజఫర్‌నగర్‌ నగరంలోని జబేపూర్‌ గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన మహిళ(23) ఇంట్లో ఉండగా.. శనివారం గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు. అక్కడినుంచి ఆమెను కారులో ఎక్కించుకుని గ్రామానికి సమీపాన ఉన్న చెరుకు తోటలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఈ విషయాన్ని బయట చెబితే చంపేస్తామని బెదిరించి మహిళను చిత్రహింసలకు గురిచేసి వదిలేశారు. ఇంటికెళ్లిన మహిళ జరిగిన విషయంలో కుటుంబ సభ్యులకు తెలిపింది.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story


లైవ్ టీవి