Top
logo

వరంగల్ జిల్లాలో మరో దారుణం..బాలికపై గ్యాంగ్ రేప్

వరంగల్ జిల్లాలో మరో దారుణం..బాలికపై గ్యాంగ్ రేప్
Highlights

వరంగల్ నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికను నమ్మించి, బెదిరించి మూకుమ్మడిగా అత్యాచారం చేశారు కొందరు కీచకులు. దీంతో వారిని ఎదిరించలేక.. అవమాన భారాన్ని బరించలేక, అయిన వారితో బాధను పంచుకోలేక.. మానసికంగా కృంగిపోయి చివరకు ఆత్మహత్య చేసుకుంది.

వరంగల్ నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికను నమ్మించి, బెదిరించి మూకుమ్మడిగా అత్యాచారం చేశారు కొందరు కీచకులు. దీంతో వారిని ఎదిరించలేక.. అవమాన భారాన్ని బరించలేక, అయిన వారితో బాధను పంచుకోలేక.. మానసికంగా కృంగిపోయి చివరకు ఆత్మహత్య చేసుకుంది.వరంగల్ హన్మకొండలో 9 నెలల చిన్నారిని హత్యాచారం చేసిన ఘటనపై ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతుండగానే. మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది.

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ సమ్మయ్య నగర్ కాలనిలో బాలిక అత్యాచార ఘటన కలకలం రేపుతోంది.. ఆగస్టు 9 ఉదయం 11 గంటల సమయంలో తిరుపతి అనే యువకుడు బాలికకు ఫోన్ చేసి, బ్లాక్ మెయిల్ చేసి, బైక్ ఎక్కించుకొని వెళ్లి తన స్నేహితులతో అత్యాచారం చేశాడని తెలుస్తోంది. తిరిగి అదేరోజు సాయంత్రం 4 గంటలకు ఇంటి దగ్గర వదిలి వెళ్లారు. ఆ అమ్మాయి దిగాలుగా ఇంటికి తిరిగొచ్చింది. దుస్తులు కూడా చిరిగిపోయి ఉండటంతో ఏం జరిగిందని నానమ్మ నిలదీసింది. తొలుత ఏం జరగలేదని చెప్పిన బాలిక.. గద్దించి అడిగే సరికి తనపై జరిగిన దారుణం గురించి గోడు వెళ్లబోసుకుంది. సమీపంలో నివాసం ఉండే బాలిక పెద్దమ్మ కూడా విషయం తెలుసుకొని బాలికకు ధైర్యం చెప్పింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామని చెప్పింది. జరిగిన దారుణాన్ని పదే పదే తలచుకొని మనస్తాపానికి గురైన బాలిక.. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకునట్లు తెలుస్తోంది. మరోవైపు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అల్లారు ముద్దుగా చూసుకుంటున్న బాలిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


Next Story


లైవ్ టీవి