నాంపల్లి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో దారుణం

నాంపల్లి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో దారుణం
x
Highlights

చిన్నారులకు ప్రాణం పోయాల్సిన హెల్త్‌‌కేర్‌ సెంటర్‌లో నిలువెత్తం నిర్లక్ష్యం ప్రభలించింది. దీంతో ముద్దులొలికే 5 నెలల చిన్నారి ప్రాణం పోయింది. మరి...

చిన్నారులకు ప్రాణం పోయాల్సిన హెల్త్‌‌కేర్‌ సెంటర్‌లో నిలువెత్తం నిర్లక్ష్యం ప్రభలించింది. దీంతో ముద్దులొలికే 5 నెలల చిన్నారి ప్రాణం పోయింది. మరి కొందరు పసి హృదయాలు విలవిల్లాడుతూ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. వ్యాక్సిన్‌ వికటించడంతో ఈ ప్రమాదం జరగిందని, ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

హైదరాబాద్ నాంపల్లి అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ లో విషాదం చోటుచేసుకుంది. టీకాలు వికటించిన ఘటనలో ఐదు నెలల చిన్నారి మృతిచెందగా మరో 22 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారికి వెంటిలేటర్ పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నాంపల్లి అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ లో ఈ ఉదయం దాదాపు 90 మంది చిన్నారులకు వ్యాక్సిన్లు వేశారు. వీరంతా 3 నుంచి 5 నెలల వయసున్నవారే. వ్యాక్సిన్ అనంతరం జ్వరం రాకుండా ఇవ్వాల్సిన మాత్రలకు బదులు వేరేవి ఇవ్వడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే, వ్యాక్సిన్ వేయడం వల్ల ఇలా జరిగిందా? లేదా మాత్రల వల్ల జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తక్షణమే నివేదిక ఇవ్వాలంటూ ఆరోగ్య శాఖను ఆదేశించింది. విషయం తెలిసిన వెంటనే ఘటన వివరాలు తెలుసుకున్న ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ నుంచి హుటాహుటిన హాస్పిటల్‌కు చేరుకని పరిస్థితిని పరిశీలించారు. మరోవైపు చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ ఆరాతీశారు. వైద్యాధికారులు కమిటీ వేసి విచారణ జరుపుతున్నారు. పేరు ప్రఖ్యాతున్న ఆసుపత్రిలో ఇంతటి నిర్లక్ష్యమేంటని చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వ్యాక్సిన్ వికటించడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories