ఫేస్‌బుక్‌ పోస్ట్‌తో కలకలం రేపిన యువకుడి అరెస్ట్‌

ఫేస్‌బుక్‌ పోస్ట్‌తో కలకలం రేపిన యువకుడి అరెస్ట్‌
x
Highlights

కనిపించిన ప్రతి అమ్మాయిని చంపుతానని హెచ్చరిన ఓ వ్యక్తిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రోవో ప్రాంతానికి చెందిన క్రిస్టోఫర్‌ డబ్ల్యూ...

కనిపించిన ప్రతి అమ్మాయిని చంపుతానని హెచ్చరిన ఓ వ్యక్తిని అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రోవో ప్రాంతానికి చెందిన క్రిస్టోఫర్‌ డబ్ల్యూ క్లిరీ కొంతకాలంగా 'ఇంపల్స్‌ కంట్రోల్‌ డిసర్డార్‌'తో బాధపడుతున్నాడు. దాంతో తనను ఏ అమ్మాయి ప్రేమించలేదన్న కారణంగా అమ్మాయిలను చంపుతాని వ్యాఖ్యలు చేస్తున్నాడు. అంతేకాకుండా ప్రతి చిన్న విషయానికి డ్రెప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్యకు యత్నిస్తున్నాడని ఎఫ్బిఐ పోలీసులు తెలిపారు.

క్లిరీ తన పేస్ బుక్ ద్వారా పోస్ట్ చేసిన విషయం ఆధాగారంగా అతనిపై ఫిర్యాదులు అందాయి. 'అతి త్వరలోనే ఎక్కువ మందిని చంపిన వ్యక్తిగా నిలవబోతున్నాను. నేను చూసిన ప్రతి అమ్మాయిని చంపడమే నా ధ్యేయం. ఎందుకంటే నాకు ఇంతవరకూ ఒక్క గర్ల్‌ ఫ్రెండ్‌ కూడా లేదు. ఇప్పటికి నేను వర్జిన్‌నే. ఇందుకు కారణం వారు నన్ను రిజెక్ట్‌ చేయడమే. అందుకే నన్ను తిరస్కరించిన అమ్మాయిలకు సరైన గుణపాఠం చెప్పాలనుకుంటున్నాను. నేను చావడానికి సిద్ధమయ్యాను. చనిపోవడానికి సిద్ధమైన వ్యక్తి కంటే ప్రమాదకరమైనది ఏదీ లేదు' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసాడావ్యక్తి. కాగా అతడి స్నేహితులు, బంధువులను విచారించారు. క్లిరీకి వైద్య పరీక్షలు జరిపించగా అతనికి 'ఇంపల్స్‌ కంట్రోల్‌ డిసర్డార్‌' ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ కారణంగానే అతను అలా బెహేవ్ చేస్తున్నాడని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories