Top
logo

హైదరాబాద్ లో దారుణం.. అత్తా కోడళ్ల హత్య..

హైదరాబాద్ లో దారుణం.. అత్తా కోడళ్ల హత్య..
X
Highlights

హైదరాబాద్ లో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లోకి ప్రవేశించి అత్తా, కోడలిని దారుణంగా నరికి...

హైదరాబాద్ లో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ ఇంట్లోకి ప్రవేశించి అత్తా, కోడలిని దారుణంగా నరికి చంపారు. ఈ ఘటన మైలార్‌దేవుపల్లి పరిధిలోని వడ్డేపల్లి చోటు చేసుకుంది. నిజామాబాద్‌ జిలా కోటగిరికి చెందిన నబీనాబేగం(55), తాయబ్(25) స్థానికంగా నివాసం ఉంటున్నారు. అయితే సోమవారం రాత్రి వారు దారుణ హత్యకు గురైనట్టు తెలుస్తోంది. తాయబ్‌ భర్త రాత్రి విధులకు వెళ్ళాడు. అతను ఇంట్లో లేని సమయంలో ఇంట్లో ప్రవేశించిన దుండగులు అత్తా కోడళ్లను హత్యచేసినట్టు సమాచారం. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్కాడ్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Next Story