లలితా జ్యువెల్లరీ చోరీ కేసులో మరో ట్విస్ట్ ...రూ.10 కోట్ల నగలు, నటితో పరార్

ఈనెల 2న తమిళనాడులోని తిరుచ్చి బస్టాండ్ సమీపంలోని లలితా జ్యువెల్లరీలో భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. అయితే లలితా జ్యువెలరీ చోరీ కేసు విచారణలో మరో ట్వీస్ట్ బయటపడింది. తమిళనాడులో లలితా జ్యువెలరీ చోరీ చేసిన తిరువారుర్ మురుగన్, ఓనటితో కలిసి 10కోట్ల రూపాయిలతో శ్రీలంకకు పరారైనట్లు తెలిసింది.
ఈనెల 2న తమిళనాడులోని తిరుచ్చి బస్టాండ్ సమీపంలోని లలితా జ్యువెల్లరీలో భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. అయితే లలితా జ్యువెలరీ చోరీ కేసు విచారణలో మరో ట్వీస్ట్ బయటపడింది. తమిళనాడులో లలితా జ్యువెలరీ చోరీ చేసిన తిరువారుర్ మురుగన్, ఓనటితో కలిసి 10కోట్ల రూపాయిలతో శ్రీలంకకు పరారైనట్లు తెలిసింది. అతని తోపాటు ఓ నటి ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మురుగన్ ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పోలీసులు రంగంలోకి దింపారు. పోలీసులు విచారణ నిమిత్తం మురుగన్ సొంత గ్రామానికి వెళ్లారు అక్కడ వారికి ఎలాంటి ఆధారాలు లభించలేదు.
అక్టోబర్ రెండున లలితా జ్యువెల్లరీ గోడకు కన్నంవేసి ముఖాలకు మాస్కులుతో షోరూంలోకి వెళ్లిన దొంగలు రూ.13 కోట్ల విలువైన బంగారు నగలు ఎత్తుకెళ‌్లారు. ఈ దొంగతనంలో సీరతొప్పు సురేష్ తో పాటు మణికంఠణ్ పాల్గొన్నారని పోలీసుల విచారణతో తెేలింది. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు మణికంఠణ్‌ను అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి సుమారు నాలుగు కీలోల నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణలోమణికంఠణ్ కీలక సాక్ష్యాలు బయట పెట్టాడు. మురుగన్ తమ ముఠా నాయకుడని వెల్లడించాడు. 13కోట్ల రూపాయిలు నగదు దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. దొంగతనంలో మణికంఠణ్తోపాటు ఉన్న సురేష్ తప్పించుకోగా అతని తల్లిని అదుపులోకి తీసుకున్నారు ఆమె వద్ద నుంచి కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మురుగన్ పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
లైవ్ టీవి
Ind Vs WI 3rd T20 : సొంత గడ్డపై చెలరేగిపోతున్న రోహిత్
11 Dec 2019 1:56 PM GMTInd Vs WI 3rd T20 : టాస్ గెలిచిన వెస్టిండీస్
11 Dec 2019 1:03 PM GMTవైరల్ : కమల్ హాసన్‌తో బ్రావో భేటీ
11 Dec 2019 12:26 PM GMTదిశపై కామారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ వివాదాస్పద వ్యాఖ్యలు
11 Dec 2019 12:23 PM GMTఅన్నంత పనీ చేశాడు.. ఫిల్మ్ చాంబర్ ముందు పురుగుల మందు తాగిన...
11 Dec 2019 12:06 PM GMT