చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరు టీవీ ఆర్టిస్టులు మృతి

చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరు టీవీ ఆర్టిస్టులు మృతి
x
Highlights

రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీవీ సీరియల్ నటులు ప్రాణాలు కోల్పోయారు. మొయినాబాద్ మండలం బీజాపూర్ హైవేపై కేతిరెడ్డిపల్లి గేట్...

రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు టీవీ సీరియల్ నటులు ప్రాణాలు కోల్పోయారు. మొయినాబాద్ మండలం బీజాపూర్ హైవేపై కేతిరెడ్డిపల్లి గేట్ సమీపంలోని మర్రిచెట్టును కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. వికారాబాద్ నుంచి మణికొండకు వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముత్యాల ముగ్గు సీరియల్ లో నటిస్తున్నభార్గవి (20), అనుషారెడ్డి (21) ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

వికారాబాద్ జిల్లా అనంతగిరిలో షూటింగ్ లో పాల్గొని వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నప్పటికీ అతివేగంగా ప్రయాణించడంతో ప్రమాదం తప్పలేదని భావిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన చక్రి, కిరణ్ ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో సీరియల్ నటులు చనిపోవడంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొన్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories