ఇంజినీరింగ్ విద్యార్థినిపై నకిలీ పోలీస్ అత్యాచారం

ఇంజినీరింగ్ విద్యార్థినిపై నకిలీ పోలీస్ అత్యాచారం
x
Highlights

ఈజీ మనీ కోసం ఏకంగా నకిలీ పోలీసు అవతారమెత్తి, ప్రేమజంటను బెదిరింపులకు గురిచేసి ఆపై యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ యువకుడు. అయితే గంజాయి మత్తులో...

ఈజీ మనీ కోసం ఏకంగా నకిలీ పోలీసు అవతారమెత్తి, ప్రేమజంటను బెదిరింపులకు గురిచేసి ఆపై యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ యువకుడు. అయితే గంజాయి మత్తులో ఉన్న బాధితురాలు తనపై అత్యాచారం జరుగుతున్న ఆ అఘాయిత్యాన్ని మాత్రం అడ్డుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే మహారాష్ట్రకు చెందిన ఓ యువతి తమిళనాడులోని తిరుచ్చి ఎన్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతోంది. అయితే అక్కడే చెన్నైకి చెందిన ఓ విద్యార్థితో ప్రేమలో పడిండి. కళాశాల అయిపోగానే ఆ యువకుడితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. అయితే ఆదివారం రాత్రి సమయంలో విద్యార్థిని కళాశాలకు కొంచెం దూరంలో ఉన్న బస్టాప్‌లో ప్రేమికులిద్దరూ కూర్చుని ముచ్చటించుకుంటున్నారు. ఇక అదే సమయంలో పోలీసు యూనిఫామ్‌లో వచ్చిన ఓ వ్యక్తి వారిద్దని నిలదీశాడు. మీరు ఇక్కడేం చేస్తున్నారంటూ గట్టిగా ప్రశ్నించాడు.

ఈ నేపథ్యంలో ప్రేమికులకు పోలీసు అవతరంలో ఉన్న వ్యక్తికి మాటమాట పెరిగింది. దీంతో పోలీసుల అవతారంలో ఉన్న ప్రియుడిపై చేయి చేసుకోవడంతో యువకుడు వెంటనే అక్కడి నుండి పరార్ అయ్యాడు. అయితే అప్పటికే ప్రేమికులిద్దారు గంజాయి సేవించి ఉన్నారు. ఈ నేపథ్యంలో మత్తులో ఉన్న యువతిపై కన్నపడింది ఆ యువకుడికి. దీంతో ఒక్క నిమిషం కుడా ఆలస్యం చేయ్యకుండా యువతిని ఎత్తుకెళ్లి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి యువతిపై అత్యాచారం చేసి వదిలి వెళ్లిపోయాడు. తరువాత బాధితురాలి ప్రియుడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఫిర్యాదు ఆధారంగా తువాక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షల నిర్వహిస్తున్నారు. అయితే ఘటన ప్రాంతంలో ఏర్పాటుచేసిన సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడిని తిరుపెరంబూరుకు చెందిన మణికంఠన్‌‌గా గుర్తించారు. మంగళవారం అతడు ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు పట్టుకోవడానికి వెళ్లారు. వారి రాకను గుర్తించిన మణికంఠన్‌ తప్పించుకునే క్రమంగా పరుగెత్తుతూ కింద పడిపోయాడు. కాళ్లకు బలంగా దెబ్బతగలడంతో పోలీసులు అతడిని ఆస్పత్రిలో తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories